ప్రైవేటు పాఠశాలలు, ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజయవాడలో 'ఫెడరేషన్ ఆఫ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్' ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు- 53 తమ పట్ల శాపంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉపాధిని కాపాడాలని కోరారు.
పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు.. నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రైవేటు పాఠశాలలు మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే ఆయా పాఠశాలలను వేధింపులకు గురిచేస్తూ భయపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని ఫీజు విధానం, ఇతర అంశాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: