కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. విజయవాడకు చెందిన కొంతమంది యువకులు కిలేస్ పురం వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లారు. ద్విచక్ర వాహనం పార్కింగ్ చేసే సమయంలో ఓ వ్యక్తి పడిపోవటంతో.. పక్కనున్న మరో వర్గం యువకులు నవ్వారు. తమ మిత్రుడిని చూసి నవ్వారని వారిపై కోపం పెంచుకున్నారు. విజయవాడ తిరిగి వెళుతున్న వారిపై.. జూపూడి వద్ద దాడి చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. విజువల్స్, వాహన నెంబర్ల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 15 మంది యువకులు దాడిలో పాల్గొన్నట్లు గుర్తించామని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఇది గ్యాంగ్ వార్ కాదని.. అవమానం తట్టుకోలేక కొందరు యువకులు చేసిన దాడి అని ఏసీపీ తెలిపారు. దాడిలో పాల్గొన్న యువకులపై నేర చరిత్ర లేదన్నారు. దాడిలో గాయపడిన వాళ్లు చికిత్స చేయించుకుని వెంటనే డిశ్ఛార్జ్ అయ్యారని తెలిపారు.
ఇదీ చదవండీ.. viveka murder case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సునీల్ యాదవ్ అరెస్ట్