ఐదుగురు ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారి ఆర్.కె.మీనాను గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు సంబంధించి అదనపు డీజీ ఆపరేషన్స్‌గా పోస్టింగ్ ఇచ్చింది. ఏసీబీ డైరెక్టర్ శంకబ్రత బాగ్చీని ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీపీగా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న త్రివిక్రమ వర్మను గుంటూరు రేంజ్ ఐజీగా నియమించారు. ఇంటెలిజెన్స్ డీఐజీ జి.విజయ్ కుమార్‌ను హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. సుధీర్ కుమార్ రెడ్డిని విజిలెన్సు, ఎన్ ఫోర్సుమెంట్ విభాగంలో ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీచదవండి