ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణకు ఈనెల 16న కలెక్టరేట్ల వద్ద నిరసన, 18న ఛలో అసెంబ్లీ నిర్వహించనున్నట్లు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జీవో నెం.42, 50, 51లను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండున్నర లక్షల మంది పేద విద్యార్థుల జీవితాలతో చెలాగాటమాడేలా జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులు, భూములను దోచుకునేందుకు కుట్ర పన్నిందని మండిపడ్డారు. లక్షలాది ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల్ని రోడ్డున పడేసేలా జగన్ రెడ్డి నిర్ణయాలున్నాయన్నారు. ఈ ప్రభుత్వాన్ని విద్యార్థి లోకం క్షమించదని ఆక్షేపించారు.
ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి తెలుగు యువత మద్దతు: శ్రీరామ్ చినబాబు
ఎయిడెడ్ విద్యాసంస్థల పరిరక్షణకు టీఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన కలెక్టరేట్ల వద్ద నిరసన, ఛలో అసెంబ్లీ కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు తెలిపారు. తెలుగు యువత కార్యకర్తలు కార్యక్రమంలో భాగస్వాములవుతారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి
Municipal Elections: అక్రమాలకు పాల్పడటంలో వైకాపా రికార్డు సాధించింది: తెదేపా నేతలు