విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధిలో భాగంగా 50కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. కరోనా సమయంలో ప్రయాణికుల రైళ్లు తక్కువ సంఖ్యలో ఉండడంతో పనులు వేగంగా జరిగాయి. ఇప్పటికే రైల్వేస్టేషన్ ప్రధాన ముఖద్వారం సర్క్యులేటింగ్ ఏరియాతో పాటు రైల్వే రిజర్వేషన్ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. స్టేషన్ రీడెవలప్‌మెంట్ పథకంలో భాగంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బుకింగ్ కౌంటర్లు పెంచడంతో పాటు వెయిటింగ్ హాళ్లు, డార్మెటరీలను కూడా ఆధునీకరిస్తున్నారు. ఒకటో నెంబను నుంచి 10వ ప్లాట్‌ఫాం వరకు మార్బుల్స్, టైల్స్, సరికొత్త డిజైన్‌తో పైకప్పు ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ అభివృద్ధి పనులపై డీఆర్‌ఎం శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి సారించడంతో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి.
పాదచారుల వంతెనతో...
ఒకటో నెంబరు ప్లాట్‌ఫాం నుంచి 10వ నెంబరును కలుపుతూ రూ.2కోట్లతో నిర్మిస్తున్న పాదచారుల వంతెన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒకటో నెంబరు ప్లాట్‌ఫాం నుంచి 6, 7 ప్లాట్‌ఫాం వరకు పాదచారుల వంతెన ఉంది. 8, 9, 10 ప్లాట్‌ఫారాలకు వెళ్లాలంటే దిగి మరో వంతెన ఎక్కాల్సి ఉంటుంది. దీంతో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కొత్తగా నిర్మిస్తున్న వంతెన ద్వారా ఒకటో నెంబరు ప్లాట్‌ఫాం నుంచి నేరుగా 10వ నెంబరుకు చేరుకోవచ్చు.
అన్ని ప్లాట్‌ఫారాల్లో లిఫ్టులు
రైల్వేస్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫారాలలో లిఫ్టులు, ఎస్కలేటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. తారాపేట స్టేషన్ వైపు 8, 9, 10 ప్లాట్‌ఫారాలలోనూ వీటిని ఏర్పాటు చేశారు. త్వరలోనే ఇవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా స్టేషన్‌లో లిఫ్టులు, ఎస్కలేటర్లు 24గంటలు పని చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: