కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్న ఓ జంట.. వారి వివాహేతర సంబంధమే వారి ప్రాణాల మీదకు తెచ్చి పెట్టింది. ఈ ఘటన తెలంగాణ నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోంద్రాట్లో చోటుచేసుకుంది. తానూర్ మండలంలోని బోంద్రాట్కు చెందిన కేరబాయికి రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భర్త మృతి చెందడంతో రెండో వివాహం చేసుకుంది. రెండో భర్త కూడా మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలతో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో అదే మండలానికి చెందిన బోసి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌తో పరిచయం ఏర్పడింది.
లక్ష్మణ్‌కు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ.. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత నాలుగేళ్లుగా వీరి సంబంధం కొనసాగుతుంది. కేరాబాయితో లక్ష్మణ్‌కు మంగళవారం రాత్రి గొడవ జరిగింది. కేరాబాయి ఇతరులతో సన్నిహితంగా ఉన్నట్లు అనుమానించిన లక్ష్మణ్.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
గమనించిన గ్రామస్థులు ఆగ్రహంతో లక్ష్మణ్‌ను చితక బాదారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన లక్ష్మణ్‌ను పోలీసులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై రాజన్న తెలిపారు.
ఇదీ చూడండి :