విజయవాడ కొవిడ్ ఆస్పత్రి నుంచి కరోనా రోగి పరారైయ్యాడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం రాజుగూడెం పీహెచ్సీలో వావిలాలకు చెందిన వ్యక్తికి శుక్రవారం నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే అతన్ని శనివారం తెల్లవారు జామున విజయవాడ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి తప్పించుకున్న వైరస్ బాధితుడు తిరిగి ఆర్టీసీ బస్సులో తిరువూరు చేరుకున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు బస్టాండుకు చేరుకున్నారు. బస్సులోనే సదరు వ్యక్తిని అధికారులు నిలువరించారు. విజయవాడ కోవిడ్ ఆస్పత్రి నుంచి పరారై తిరువూరు వచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తిని అదే బస్సులో అధికారులు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ప్రయాణికుడు కరోనా బాధితుడు అని తెలియటంతో బస్సు డ్రైవర్, కండక్టరు, బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
విజయవాడ కొవిడ్ ఆసుపత్రి నుంచి వ్యక్తి పరారీ - విజయవాడ కొవిడ్ ఆస్పత్రి నుంచి పరారైన రోగి న్యూస్
విజయవాడ కొవిడ్ ఆస్పత్రి నుంచి కరోనా పాజిటివ్ వ్యక్తి పరారయ్యాడు. వైద్యశాల నుంచి తప్పించుకుని ఎంచక్కా ఆర్టీసీ బస్సులో తిరువూరు చేరుకున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని..బస్సులో కరోనా పాజిటివ్ వ్యక్తిని గుర్తించారు.
విజయవాడ కొవిడ్ ఆస్పత్రి నుంచి కరోనా రోగి పరారైయ్యాడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం రాజుగూడెం పీహెచ్సీలో వావిలాలకు చెందిన వ్యక్తికి శుక్రవారం నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే అతన్ని శనివారం తెల్లవారు జామున విజయవాడ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి తప్పించుకున్న వైరస్ బాధితుడు తిరిగి ఆర్టీసీ బస్సులో తిరువూరు చేరుకున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు బస్టాండుకు చేరుకున్నారు. బస్సులోనే సదరు వ్యక్తిని అధికారులు నిలువరించారు. విజయవాడ కోవిడ్ ఆస్పత్రి నుంచి పరారై తిరువూరు వచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తిని అదే బస్సులో అధికారులు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ప్రయాణికుడు కరోనా బాధితుడు అని తెలియటంతో బస్సు డ్రైవర్, కండక్టరు, బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఇవీ చూడండి-పెళ్లింట.. కరోనా తంటా!
TAGGED:
విజయవాడ లేటెస్ట్ వార్తలు