శ్రావణమాసం మూడవ శుక్రవారం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు కిక్కిరిశాయి. అమ్మవార్లకు ప్రీతికరమైన రోజు కావడంతో మహిళలు పెద్ద ఎత్తున దర్శించుకునేందుకు బారులు తీరారు. ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతాలు ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు పాల్గొన్నారు. మల్లికార్జున మహామండపము 6వ అంతస్తులో జరుగుతున్న కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు వ్రతాన్ని నిర్వహించారు.
ప్రకాశం జిల్లా చీరాలలో పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈపురుపాలెం మార్కెట్ సెంటర్లోని శ్రీ భద్రావతి సమేత భవన్నారాయణ దేవాలయంలో నూతనంగా నిర్మించనున్న గాలిగోపురానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని కోట దుర్గమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున మహిళలు బారులు తీరారు. వేకువజాము నుంచే అమ్మవారి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పూజల్లో వెయ్యి మంది మహిళలు పాల్గొన్నారు. శుక్రవారం వేకువజాము నుంచి ప్రత్యేక కుంకుమ పూజలు ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: