మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా... ఆయనను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ట్విటర్ వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు సందేశమిచ్చారు. ఎన్నో సామాజిక సంస్కరణలకు పూలే నాంది పలికారని.. తెదేపా స్థాపనకు స్ఫూర్తిగా నిలిచిన వారిలో ఆయన ఒకరని కీర్తించారు. ఆ మహానుభావుని స్ఫూర్తితోనే బీసీల అభ్యున్నతికి ఆది నుంచి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందన్నారు. బీసీలకు రాజ్యాధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించిన పార్టీ తెదేపా అని.. బీసీల హక్కుల సాధనకు పునరంకితం అవుదామని చంద్రబాబు తెలిపారు. తెదేపా ఐదేళ్ల పాలనలో బీసీలకు రూ.46వేల కోట్ల బడ్జెట్ కేటాయించిందని గుర్తు చేశారు. బీసీలకు ఫెడరేషన్లు, ప్రత్యేక కార్పొరేషన్లు, ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తి చేశారు. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తెచ్చిన ఘనత తమదేనని ప్రజలకు ట్వీట్ ద్వారా గుర్తు చేశారు.
ఇవీ చదవండి: