ETV Bharat / city

హైదరాబాద్ - విజయవాడ మధ్య హై స్పీడ్‌ రైలు రావాలి: కేటీఆర్ - తెలంగాణ మంత్రి కేటీఆర్ వార్తలు

హైదరాబాద్ ‌- విజయవాడ మధ్య హైస్పీడ్‌ రైలు కోసం తమ వంతు కృషి చేస్తామని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రెండు నగరాల మధ్య హైస్పీడ్‌ రైలు వస్తే హైవే వెంట అభివృద్ధి జరిగి ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని అభిప్రాయపడ్డారు.

telangana minister-ktr comments hispeed train in hyd to vijayawada
తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్
author img

By

Published : Jun 29, 2020, 4:08 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్

విజయవాడ ముఖ్యమైన ఆర్థిక కేంద్రం అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోనే హైదరాబాద్‌ ఓ ముఖ్యమైన మెట్రోపాలిటన్‌ నగరమని తెలిపారు. అలాంటి ఈ రెండు పట్టణాలు హైదరాబాద్ ‌- విజయవాడ మధ్య.. హైస్పీడ్‌ రైలు సేవలు అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ మేరకు తమ వంతు కృషిచేస్తామని.. రైలు వస్తే హైవే వెంట మరింత అభివృద్ధి జరుగుతుందని అభిలషించారు. సోమవారం ఆయన తెలంగాణలోని హుజూర్‌నగర్‌ ఆర్డీవో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పురపాలక కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

'మళ్లీ కరోనా పరీక్షలు.. లాక్​డౌన్​పై మంత్రివర్గంలో నిర్ణయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.