పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... మాజీమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, పీతల సుజాత, మాజీఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు తమతమ నివాసాల వద్ద నిరసన దీక్షకు కూర్చున్నారు. లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే విద్యుత్ షాక్ ఇచ్చారని నేతలు మండిపడ్డారు.
రెండు ఫ్యాన్లు, రెండు బల్బులు, ఒక టీవీ ఉన్న సామాన్యులకు 3వేల బిల్లులు వచ్చాయని ధ్వజమెత్తారు. లాక్డౌన్ సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.