ETV Bharat / city

డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ - varla ramayya latest news

డీజీపీ గౌతమ్ సవాంగ్​కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెదేపా నేత వర్ల రామయ్యను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు.

tdp president chandrababu naidu wrote a letter to dgp
డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
author img

By

Published : Apr 8, 2021, 6:23 PM IST

తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్​కి లేఖ రాశారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై స్పందిస్తున్న తెదేపా నేత వర్ల రామయ్యకు ఈ నెల 7న ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడని లేఖలో వివరించారు. ముఖ్యమంత్రి జగన్​ను విమర్శించడం మానుకోవాలని బెదిరించినట్లు లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వర్ల రామయ్య కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి: లైవ్ ఆప్​డేట్స్: ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.