ETV Bharat / city

ప్రభుత్వానికి జ్ఞానోదయం కావాలి: చంద్రబాబు - babu family visited indrakeeladri

తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి ఇంద్రికీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రం బాగుండాలని ప్రార్థించినట్టు చంద్రబాబు చెప్పారు.

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

author img

By

Published : Jan 1, 2020, 11:13 AM IST

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి ఇంద్రికీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకుని అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతిని పరిరక్షించి.. రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. తన ముందు చూపును అధికార పార్టీ నేతలు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని 5 కోట్ల మంది భవిష్యత్​కు సంబంధించిన విషయమని చెప్పారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం రాజధాని ప్రాంతాల్లో బాబు పర్యటించనున్నారు. అమరావతి కోసం ఆందోళన చేస్తున్న ఐకాసలకు.. చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటంతో.. ప్రభుత్వానికి జ్ఞానోదయం కావాలని దుర్గమ్మను కోరుకున్నట్టు చెప్పారు.

ఇదీ చూడండి:

ఈ కొత్త సంవత్సరం.. కొంగొత్త కానుకిద్దాం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.