బీసీల గొంతు కోసిన ముఖ్యమంత్రికి.. తిరుపతి ఉపఎన్నికల్లో వారంతా ఏకతాటిపైకి వచ్చి బుద్ధి చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపునిచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్లో జనాభా పరంగా 80శాతంగా ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. రిజర్వేషన్లు 24శాతానికి తగ్గటం వల్ల 16,800 పదవులు బలహీనవర్గాలు కోల్పోయారని తెలిపారు. 742 వివిధ నామినేటెడ్ పదవులను తన వర్గానికే కట్టబెట్టారని ధ్వజమెత్తారు. మోసపు మాటలతో బీసీ, ఎస్సీ, మైనారిటీలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా