పంచాయతీ ఎన్నికలను ఆపలేకపోయిన ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టిస్తోందని ఎమ్మెల్సీ అశోక్బాబు విమర్శించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వం కొత్త అవరోధాలను కల్పిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎవరికీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వవద్దని ఎమ్మార్వోలకు చెప్తున్నారని అశోక్ బాబు మండిపడ్డారు.
ఎమ్మార్వోలను పిలిపించి పెద్దిరెడ్డి మాట్లాడటం ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని అన్నారు. ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కోర్టు తీర్పు తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు మొహం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు ఇకనైనా బాధ్యతగా వ్యవహరించాలని.. రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చడం సరికాదని హితవు పలికారు.
ఇదీ చదవండి: ఎన్నికల భద్రతా పర్యవేక్షకుడిగా బాధ్యతలు చేపట్టిన ఐజీ సంజయ్