పురపాలక ఎన్నికల తర్వాత భారీగా ఇంటి పన్నులు, ఇతరత్రా పన్నులను పెంచి ప్రజలపై మోయలేని భారం మోపేందుకు వైకాపా సిద్ధంగా ఉందని తెదేపా నేత నారా లోకేశ్ విమర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన..మేయర్ పీఠాన్ని తెదేపాకే కట్టబెట్టాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో మంత్రులు బాధ్యతను మరిచి పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. "తాడేపల్లిలో కోడికత్తి రెడ్డిగారు.. మచిలీపట్నంలో తాపీ కత్తి నానిగారు ఈ రెండేళ్ల వ్యవధిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి" అంటూ నిలదీశారు.
తెదేపాకు అధికారం కట్టబెడితే..అన్న క్యాంటీన్లను పునరుద్ధరించటంతోపాటు ఇంటిపన్ను మాఫీ చేస్తామంటూ ప్రకటించారు. ప్రచారంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తదితరలు పాల్గొన్నారు.
ఇదీచదవండి