విజయవాడ తూర్పు నియోజకవర్గం వివేకానంద కా లనీలో ఎంపీ కనకమేడల రవీంద్ర నిధులతో నిర్మించిన వెనుకబడిన వర్గాల కమ్యూనిటీ హాలును... వైకాపా ప్రభుత్వం సచివాలయంగా మార్చడాన్ని తెదేపా నేతలు వ్యతిరేకించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెదేపా నాయకురాలు కేశినేని శ్వేత.. కమ్యూనిటీ హాలును సందర్శించి, స్థానికులతో మాట్లాడారు. కాలనీ ప్రాంతంలో ఎక్కువ మంది కార్మికులు నివసిస్తున్నారని... వారి విజ్ఞప్తి మేరకు ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగిందని గద్దెరామ్మెహన్ తెలిపారు.
వైకాపా ప్రభుత్వం వారి సంక్షేమం పక్కన పెట్టి సచివాలయంగా మారుస్తోందని మండిపడ్డారు. ఎంపీ నిధులను రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించకూడదని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలను మానుకుని, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని కేశినేని శ్వేత హితవు పలికారు. పేద, మధ్య తరగతి ప్రజలు అందుబాటు ధరలలో శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు జరుపుకునే వీలున్న కమ్యూనిటీ హాలును వైకాపా ప్రభుత్వం అనాలోచితంగా వార్డు సచివాలయంగా మార్చడం శోచనీయమన్నారు.