వైకాపా గుర్తింపును రద్దు చేయాలని.. కేంద్ర ఎన్నిక సంఘాని(tdp leaders complaint to ec on ycp)కి తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ సహా.. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు కృషిచేస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు, కార్యాలయాలపై దాడులకు పాల్పడుతూ.. ప్రాథమిక హక్కులను హరిస్తోందని విరమర్శించారు. ఈ మేరకు దిల్లీకి వెళ్లిన తెదేపా నేతలు కనకమేడల రవీంద్రకుమార్, కేసినేని నాని, నిమ్మల కిష్టప్ప.. కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు(tdp leaders Meet to Central Election Commission) చేశారు. రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తే తమపై దాడులు చేస్తున్నారని.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని ఈసీ తమకు హామీ ఇచ్చినట్టు తెదేపా నేతలు తెలిపారు.
వైకాపా.. పూర్తిగా అవినీతి, నేరమయ కార్యకలాపాలల్లో మునిగిపోయిందన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్.. అనేక ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని ఆరోపించిన నేతలు.. అక్రమ మార్గాలతో సంపాదించిన డబ్బుతో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నారని విమర్శించారు. ఒకప్పుడు డగ్స్ అంటే ఎక్కడో పేరు వినిపించేదని.. వైకాపా హయంలో గంజాయి, హెరాయిన్, డ్రగ్స్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీని ఇప్పటికే గుండా, రౌడీ రాజ్యంగా మార్చిన అధికార పార్టీ.. తాజాగా డ్రగ్స్ హబ్‌గా మార్చిందని దుయ్యబట్టారు. దొంగే.. దొంగ దొంగ అన్నట్టుగా వైకాపా తీరు ఉందన్న నేతలు.. వైకాపా నేతలు, మంత్రుల భాషతో.. రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చారన్నారు. ఇప్పుడు తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి..
CBN: ఆ ఎన్నికల్లో వైకాపాను ఓడిస్తేనే.. రాష్ట్రానికి రక్షణ: చంద్రబాబు