రుయా ఘటన బాధితులకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు పరిహారం ఎప్పుడిస్తారో కూడా చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించి ప్రజల్ని కాపాడాలని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి ప్రజల్లోకి రావాలంటే రుయా లాంటి ఘటనలు ఇంకెన్ని జరగాలని తెదేపా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు నరసింహ ప్రసాద్ నిలదీశారు. ఇప్పుడున్న వ్యాక్సిన్లు సీఎంకు ఇష్టం లేకనే తనకు నచ్చిన టీకాలు వచ్చే వరకూ ప్రజల ప్రాణాలు పోయేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాలనంటే ప్రజల సొమ్ముతో భోగాలు అనుభవించడం కాదని తెలుసుకోవాలని హితవు పలికారు.
ఇవీ చదవండి:
'కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం!'
కరోనా రోగి మృతదేహాన్ని నడిరోడ్డుపైనే దింపేయడం అమానుషం: చంద్రబాబు