విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై(electricity problems) రాష్ట్ర ప్రభుత్వం.. శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్(kanakamedala ravindra kumar) మాట్లాడుతూ.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులను ప్రభుత్వం దారి మళ్లించిందని అరోపించారు.
రూ.25వేల కోట్ల అప్పుతో.. బొగ్గు ఉత్పత్తి సంస్థల బకాయిలు చెల్లించకుండా.. అందులోని రూ.6వేల కోట్ల నిధులు దారిమళ్లించారని రవీంద్రకుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణం.. ఈ నిధుల దుర్వినియోగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై సర్కారు శ్వేతపత్రం విడుదల చేయగలదా? అని సవాల్ విసిరారు.
విద్యుత్ కోతలపై ప్రాంతాల వారీగా పోరాటం చేయాలని తెదేపా నేత చినరాజప్ప ప్రజలకు పిలుపునిచ్చారు. వైకాపా సర్కార్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని మండిపడ్డారు. ఈ నెల 20న అనకాపల్లి(anakapalli) పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(TDP leader nara lokesh) వస్తున్నారని చినరాజప్ప(chinarajappa) తెలిపారు.
ఇదీచదవండి.