తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్‌ను రద్దు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో మళ్లీ నిర్వహించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి పెద్ది రెడ్డి దౌర్జన్యాలతో... రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తన చిరునామా కోల్పోయిందని ధ్వజమెత్తారు. బయట నుంచి పెద్ద ఎత్తున స్థానికేతరులను తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్లు వేయించేందుకు తరలిస్తున్నారని ఆరోపిస్తూ పలు వీడియోలను మీడియాకు ఇచ్చారు. దొంగ ఓట్లపై అన్ని ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువల్ని పూడ్చేశారనటానికి తిరుపతి ఉపఎన్నికే నిదర్శనం. జగన్, పెద్దిరెడ్డి చర్యలతో రాజ్యాంగ వ్యవస్థులు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి నెలకొంది. దొంగ ఓటరు కార్డులు సృష్టించి పంపిణీ చేసేందుకు వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేశారు. దొంగ ఓట్లపై ప్రతిపక్షాల ఫిర్యాదును ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. పోలీసు వ్యవస్థ నిస్సహాయ స్థితిలో ఉంది. ముఖ్యమంత్రి చెప్తున్న లక్షల ఓట్ల మెజారిటీ దొంగ ఓట్లతోనేనని స్పష్టమైంది.
-వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు
ఇదీ చూడండి: