ETV Bharat / city

పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం: నక్కా ఆనంద్ బాబు

author img

By

Published : May 4, 2022, 2:18 PM IST

Nakka Anand Babu: వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షలలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. చేసిన అభివృద్ధి లేదు.. చేయాలనే ప్రణాళిక లేదు.. విధ్వంసం, వినాశకం ఇదే వైకాపా ప్రభుత్వ జెండా, ఎజెండా అని ధ్వజమెత్తారు.

Nakka Anand Babu
పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది

Nakka Anand Babu: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. రాష్ట్రంలో రోజుకోచోట ప్రశ్నాపత్రాలు లీక్‌ అవుతుంటే మంత్రి బొత్స మాత్రం లీకేజీ లేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ జరగకపోతే ఉపాధ్యాయులను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణ సరిగా లేకపోవటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు.

అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దిగజార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. చేసిన అభివృద్ధి లేదు.. చేయాలనే ప్రణాళిక లేదు.. విధ్వంసం, వినాశకం ఇదే వైకాపా ప్రభుత్వ జెండా, ఎజెండా అని ధ్వజమెత్తారు. నాటు సారా తాగి జనాలు మరణిస్తే.. సారానే లేదని అసెంబ్లీలో ప్రకటించిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి అని విమర్శించారు.

ఇదీ చదవండి: High court: ఆ కేసులో చింతమనేని ప్రభాకర్‌కు ఊరట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.