గంజాయి సాగు, రవాణాపై మాట్లాడినందుకు అర్ధరాత్రి నర్సీపట్నం పోలీసులు ఇంటికొచ్చి నోటీసులిచ్చారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు చెప్పారు. ఆధారాలు సేకరించాలంటూ హంగామా సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ, ఎంపీ విజయసాయిరెడ్డికి ఎప్పుడు నోటీసులిస్తారని ప్రశ్నించారు. గంజాయి సాగుతో తెదేపా నేత నారా లోకేశ్ కు సంబంధం ఉందంటూ.. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజమెంతో డీజీపీ తేల్చాలని డిమాండ్ చేశారు.
మాదకద్రవ్యాలకు ఏపీ కేంద్రంగా మారిందంటూ జనసేనాధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఎస్సీ నేతనైనందునే తనకు పోలీసులు నోటీసులు ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. నర్సీపట్నం సీఐ, విశాఖ డీఐజీ తక్షణమే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయసాయి నుంచి వెంటనే ఆధారాలు సేకరించాలని అన్నారు. తెలంగాణకు గంజాయి ఏపీ నుంచే వస్తుందన్న.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, నల్గొండ ఎస్పీలకూ నోటీసులివ్వాలన్నారు.
ఇదీ చదవండి: