ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో లక్ష కరోనా మరణాలు సంభవించాయని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. కొవిడ్ మృతులపై ప్రభుత్వం చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మే 14న ఆరుగురు చనిపోయారని ప్రకటించారని.. కానీ 32 మంది మరణించినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రమంతటా ఇదే తరహాలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల పరిహారంతో పాటు.. ఉపాధి కోల్పోయిన కోటి కుటుంబాలకు రూ.10 వేలు ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తప్పుడు లెక్కలు మానుకుని.. కొవిడ్ మృతుల బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
ఇవీ చదవండి: