కొత్తగా ఒక జత యూనిఫామ్, బ్యాగు, టై ఇచ్చేసి విద్యార్థులను ఉద్దరించినట్లుగా వైకాపా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని తెదేపా నేత డోలా బాలవీరాంజనేయస్వామి మండిపడ్డారు. ఒకచేతితో ఇస్తూ, ఇంకో చేతితో లాక్కోవడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు చేకూర్చే బెస్ట్ అవేలబుల్ పథకాన్ని జగన్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని నిలదీశారు. 8, 9వ తరగతి విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, విదేశీ విద్యాదీవెన పథకాలు ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. జగనన్న విద్యకానుక.. ప్రచార ఆర్భటం తప్ప, విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచే విద్యాప్రమాణాలు లేవని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: