ETV Bharat / city

UMA BAIL CELEBRATIONS: దేవినేనికి బెయిల్​ మంజూరుపై తెదేపా శ్రేణుల హర్షం - ILLEGAL MINING

గ్రావెల్​ అక్రమ మైనింగ్​ను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో జరిగిన ఘర్షణలో.. అరెస్టైన మాజీ మంత్రి దేవినేనికి హైకోర్టు బెయిల్​ మంజూరు చేయడంపై తెదేపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు అనేక చోట్ల మిఠాయిలు పంచుకున్నారు. ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.. వైకాపా నాయకులను హెచ్చరించారు.

UMA BAIL CELEBRATIONS
దేవినేని బెయిల్​ మంజూరుపై తెదేపా శ్రేణుల హర్షం
author img

By

Published : Aug 4, 2021, 5:34 PM IST

హైకోర్టు (HIGH COURT)... మాజీ మంత్రి దేవినేనికి బెయిల్ (DEVINENI BAIL CELEBRATIONS) మంజూరు చేయడంపై తెదేపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ నాయకులు మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్రమ అరెస్టుకు నిరసనగా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య(TANGIRALA SOWMYA), పలువురు తెదేపా నాయకులు నిరసన దీక్ష చేస్తున్న సమయంలోనే.. దేవినేనికి బెయిలు మంజూరు కావడంపై.. నేతలంతా సంతోషాన్ని వ్యక్త పరిచారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ప్రజలు చూస్తున్నారని తగిన సమయంలో.. ప్రభుత్వానికి వారు గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు.

దేవినేని అరెస్ట్​ జరిగిందిలా..

కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో.. గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ (ILLEGAL MINING) జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధరణకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైకాపా వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఇది వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య బాహాబాహీకి దారితీయటంతో.. పోలీసులు లాఠీఛార్జి చేశారు. వాహనం ధ్వంసంతోపాటు.. పలువురు గాయపడేందుకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ.. వాహనంలోనే ఉమా నిరసనకు దిగారు. కారు అద్దం పగులగొట్టిమరీ పోలీసులు ఉమాను అరెస్టు చేసి..పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కొండపల్లి అటవీ ప్రాంతంలో.. అక్రమంగా గ్రావెల్‌ తవ్వుతున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆ ప్రాంతంలో పర్యటనకు వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌.. అటవీ సంపద కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పరిశీలన అనంతరం తిరిగి వస్తుండగా.. గడ్డమణుగ గ్రామం వద్ద.. దేవినేని ఉమా వాహనంపై అకస్మాత్తుగా వైకాపా(YSRCP) శ్రేణులు దాడికి దిగారు. పెద్దఎత్తున అల్లరి మూకలు రాళ్లు విసురుతూ అక్కడికి చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉమ కారుతోపాటు పలు వాహనాలు ఈ ఘర్షణలో ధ్వంసమయ్యాయి. అక్కడికి చేరుకున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు.. వైకాపా శ్రేణులను ప్రతిఘటించటం బాహాబాహీకి దారితీసింది.

పోలీసులు అక్కడికి చేరుకుని.. లాఠీఛార్జి చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. అక్కడి నుంచి ఉమా వాహనాన్ని పంపించేశారు. దాడికి (ATTACK) దిగనవారిని పోలీసులు అరెస్టు చేయకపోవటంపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరును నిరసిస్తూ.. జి.కొండూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద కారులోనే ఆందోళనకు దిగారు. ఉమాకు మద్దతుగా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున బయలుదేరిన తెలుగుదేశం కార్యకర్తలు, నేతలను.. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

ఇదీ చదవండి:

ANITHA ON ARREST: మహిళా లోకానికి ఇది చీకటి రోజు: వంగలపూడి అనిత

arrest: అర్ధరాత్రి హైడ్రామా.. దేవినేని ఉమా అరెస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.