ముఖ్యమంత్రి జగన్ తీరు వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువయ్యాయని తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమా విమర్శించారు. టెస్టింగ్ కిట్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆయన.. పక్క రాష్ట్రంలో 300 రూపాయలు ఉన్న కిట్లను 700 రూపాయలకి కొనుగోలు చేసి అడ్డగోలుగా దోచేశారని ధ్వజమెత్తారు. మెడికల్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు లేవని ఆగ్రహించారు.
రైతుల కోసం సీఎం జగన్ చేపట్టిన చర్యలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. లాక్‍డౌన్ వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. రాష్ట్రంలో 50 లక్షల టన్నుల ధాన్యం పండితే 2 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: