వైకాపా ప్రభుత్వానికి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం పట్ల గౌరవం, చట్టం అంటే విలువ రెండూ లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. హైకోర్టు తీర్పుని తూర్పారపడుతూ అర్ధరాత్రి జీవోలు ఇచ్చారని మండిపడ్డారు. ప్రజలు కూడా తమకు ''రాజారెడ్డి'' రాజ్యాంగం అవసరంలేదని తిరగబడితే.... వైకాపా పరిస్థితి ఏమవుతుందో ఒక్క సారి ఆలోచించుకొవాలని హెచ్చరించారు. ఇప్పటికైనా రాజ్యాంగం,చట్టాల పట్ల గౌరవంగా వ్యవహరించాలని హితవు పలికారు.
ఇవీ చదవండి: 'పార్టీ మారే ఉద్దేశం లేదు.. తెదేపాలోనే కొనసాగుతా'