ETV Bharat / city

పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే.. నారాయణ అరెస్టు:​ చంద్రబాబు

TDP Condemned Narayana Arrest: మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ అరెస్టును తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేశారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని తెదేపా నేతలు ఆరోపించారు. జగన్​ తాత్కాలిక ఆనందం కోసమే ఇలాంటి తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు.

TDP Condemned Narayana Arrest
TDP Condemned Narayana Arrest
author img

By

Published : May 10, 2022, 12:51 PM IST

Updated : May 10, 2022, 5:24 PM IST

Chandrababu Condemned Narayana Arrest: పదో తరగతి పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశారని ఆ పార్టీ ఆధినేత చంద్రబాబు ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో విఫలమై అన్నివర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వైకాపా సర్కార్​.. జీర్ణించుకోలేక ఈ తరహా కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. నారాయణ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. మాస్ కాపీయింగ్​, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని నిలదీశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా, అధారాలు లేకుండా నేరుగా అరెస్టు చేయడం కక్షపూరిత చర్య కాదా? అని మండిపడ్డారు. నారాయణను జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన రోజునుంచి అక్రమ కేసులతో జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Lokesh News: చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులని చేయడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్‌ అని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతోపాటు రాజకీయ కక్షసాధింపులో భాగంగానే మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశారని లోకేశ్​ దుయ్యబట్టారు. సంబంధంలేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సీఎం జగన్.. విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూశారన్నారు. ఈ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైకాపా నేతల్ని వదిలేసి తెదేపా నేతల్ని అరెస్ట్ చేయించి సీఎం సైకో ఆనందం పొందొచ్చు కానీ.. పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎలాంటి మేలూ జరగదని లోకేశ్‌ అన్నారు.

Achennaidu on Narayana Arrest: ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెబుతుంటే.. మాజీ మంత్రి నారాయణను ఎలా అరెస్ట్ చేస్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో విఫలమై.. ఆ నెపాన్ని నారాయణపై నెట్టారని మండిపడ్డారు. అక్రమ అరెస్టుల పట్ల భవిష్యత్​లో మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రోజురోజుకూ జగన్ రెడ్డిపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ మళ్లింపు రాజకీయాలని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

MLC Ashok Babu: శ్రీలంక తరహాలో పాలకులపై దాడులు జరక్కముందే ముఖ్యమంత్రి జగన్‌ అక్రమ అరెస్టులు ఆపాలని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు. నారాయణపై కేసులేవీ నిలబడవని ముఖ్యమంత్రికి తెలిసినా.. తాత్కాలిక ఆనందం కోసమే ఇలాంటి తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తును సీఎం కోరుకుంటే.. ప్రశ్నాపత్రాల లీక్‌ కేసులో విద్యాశాఖ మంత్రి బొత్సను అరెస్ట్ చేయించాలని డిమాండ్‌ చేశారు. విద్యాసంస్థల్లో తప్పు జరిగిందని నారాయణను అరెస్టు చేయించిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలకు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేస్తారా ? అని నిలదీశారు.

నారాయణ విద్యా సంస్థలంటే ఆషామాషీగా ఉందా?: సోమిరెడ్డి

Somireddy on Narayana Arrest: మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నారాయణ విద్యా సంస్థలంటే అంత ఆషామాషీగా ఉందా? అని ప్రశ్నించారు. 6 లక్షల మందికిపైగా విద్యార్థులు, 60 వేల మంది ఉద్యోగులతో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో నారాయణ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం విద్యాసంస్థల బాధ్యతను నారాయణ పిల్లలు చూసుకుంటున్నారని.. రాజకీయాల్లోకి వచ్చాక విద్యాసంస్థల బాధ్యతను ఆయన పూర్తిగా వదిలేశారని సోమిరెడ్డి పేర్కొన్నారు. నారాయణ విద్యా సంస్థల్లో ఎవరైనా తప్పు చేస్తే ఛైర్మన్‌ను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. విద్యాశాఖలో లీకేజీపై ఆ శాఖ మంత్రిని కూడా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కక్షపూరిత రాజకీయాలకు ఇప్పటికైనా వైకాపా స్వస్తి పలకాలని సోమిరెడ్డి హితవు పలికారు.

వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాన్సాస్​ సంస్థ ఛైర్మన్​ అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు. తెదేపా నాయకులు అందరిపై కేసులు పెడుతున్నారని.. తప్పుడు కేసులు పెట్టి భయాందోళనకు గురిచేస్తున్నారని గజపతిరాజు విమర్శించారు. నారాయణ అరెస్టును తెదేపా నేతలు కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు. నారాయణ అరెస్టుపై ప్రభుత్వం కారణం చెప్పే పరిస్థితిలో లేదని.. గంటగంటకు ఎఫ్ఐఆర్ మారుస్తున్న దుస్థితి నెలకొందని కళా వెంకట్రావు విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలో ప్రజల దృష్టి మళ్లించేందుకే తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 10, 2022, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.