జగన్ పాలనలో రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్గా మారిందని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. పేకాట కేంద్రాల నిర్వహణతో సంబంధమున్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి గుమ్మనూరు జయరామ్ పేకాట బాగోతం ప్రజలు మరవకముందే.. శ్రీదేవి వ్యవహారం బయటకు వచ్చిందన్నారు. యువతను పెడదోవ పట్టించేలా, ఆదాయం కోసం పేకాట కేంద్రాలు నడుపుతున్న శ్రీదేవి ఎమ్మెల్యే పదవికి అనర్హురాలని విమర్శించారు.
వైకాపా నేతల తీరు చూస్తుంటే, సచివాలయాన్ని కూడా పేకాట కేంద్రంగా మార్చేలా ఉన్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తన మనస్సాక్షికి పరదాలు కట్టుకున్నట్టు ఉన్నారని.. అందుకే రాజధాని రైతుల వెతలను, వారి ఆవేదనను పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు.
ఇదీచదవండి
ఫోన్ కాల్ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీదేవి.. ఏమన్నారంటే..?