TDP DALITHA GARJANA: వైకాపా అధికారంలోకి వచ్చాక రద్దు చేసిన.. దళితోద్ధరణ పథకాలు పునరుద్ధరించాలంటూ.. తెలుగుదేశం విజయవాడలో తలపెట్టిన దళితగర్జనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దాంతో తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్.ఎస్.రాజు ఆధ్వర్యంలో పలువురు నాయకులు ధర్నా చౌక్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ధర్నాకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చిన పోలీసులు.. ఇప్పుడు నిరాకరించారని రాజు తెలిపారు. వైకాపా ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. అయితే వాటర్ ట్యాంక్ ఎక్కిన తెదేపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు గృహ నిర్బంధించారు. విజయవాడలో తెదేపా ఎస్సీ సెల్ నాయకులు నిర్వహిస్తున్న దళిత గర్జనకు వెళ్లకుండా ఆనందబాబును అడ్డుకున్నారు. నక్కా ఆనందబాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
బాపట్ల జిల్లాలోని ఏలూరి సాంబశివరావు క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించారు. క్యాంప్ ఆఫీస్లో ఉన్న ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి, తెదేపా ఎస్సీ సెల్ నాయకుడు సురేష్లను పోలీసులు గృహనిర్బంధించారు. నందిగామలో తెదేపా నాయకురాలు తంగిరాల సౌమ్యను పోలీసులు గృహ నిర్బంధించారు. విజయవాడలో దళిత గర్జనకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఇవీ చదవండి: