ఉన్నత స్థాయి కమిటీ ఎందుకు అన్నిసార్లు భేటీ అవుతుందో చెప్పాలని తెదేపా మాజీఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఉద్యమం చేస్తున్న రైతుల కులం ఎందుకు అడుగుతున్నారని ఆమె మండిపడ్డారు. కేసుల పేరుతో ఇబ్బంది పెట్టాలని చూస్తే... మహిళలు తిరగబడతారని హెచ్చరించారు. 144 సెక్షన్ పేరుతో జాతీయ మహిళా కమిషన్ సభ్యులను రాజధానిలో సరిగా తిరగనివ్వలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ సభ్యులు మరోసారి ఆంధ్రాలో పర్యటించాలని వంగలపూడి అనిత కోరారు. హోంమంత్రి హైపవర్ కమిటీలో తప్ప బయట కనిపించడంలేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్-జగన్ భేటీ తర్వాత రాష్ట్రం ఎటు వెళుతుందోనని భయంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: ఈ నెల 20, 21, 22 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు