రస్ అల్ ఖైమా వేట భయంతోనే జగన్ దిల్లీ పరిగెత్తారని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వైఎస్ హయాంలో రస్ అల్ ఖైమా, నిమ్మగడ్డ ప్రసాద్ సంయుక్తంగా వాన్ పిక్‌లో పెట్టుబడులు పెట్టారని గుర్తు చేశారు. సెర్బియా పోలీసుల విచారణలో నిమ్మగడ్డ ప్రసాద్ పలు విషయాలు వెల్లడించారని అన్నారు. రస్ అల్ ఖైమా పెట్టుబడులన్నీ జగన్‌మోహన్ రెడ్డికే బదలాయించినట్టు విచారణలో నిమ్మగడ్డ ఒప్పుకున్నారని అన్నారు. ఏ1 జగన్మోహన్ రెడ్డిని తమకు అప్పగించాలని రస్ అల్ ఖైమా కేంద్రానికి లేఖ రాసిందన్న సమాచారం తమకు ఉందన్న రామానాయుడు.. గల్ఫ్ కు చిక్కకుండా అవసరమైతే వైకాపాని భాజపా చేతిలో పెట్టేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్, విజయసాయి అవినీతి చిట్టా మొత్తం విదేశాంగ మంత్రి దగ్గర ఉందన్నారు. జగన్ వ్యూహంలో భాగంగానే మంత్రి బొత్స సత్యనారాయణ పీలర్స్ వదులుతున్నారని మండిపడ్డారు.
ఇవీ చదవండి: