విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. గతంలో లేడీస్ హాస్టల్ నిర్వహించిన భవనంలోనే జూదమాడుతున్నట్లు గుర్తించారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో గుంటూరుకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారని సమాచారం.
జూదం శిబిరాన్ని నడిపేది... విజయవాడకు చెందిన వారేనని పోలీసులు గుర్తించారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు. దాడిలో 7లక్షల 56వేల 550 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: