తానా ఆధ్వర్యంలో జరిగిన 'మదర్స్ డే - అమ్మా నీకు వందనం' చరిత్ర సృష్టించింది. తానా సంస్థ ఆధ్వర్యంలో జిజ్ఞాస, జయహో భారతీయం, ఏపీ ఎన్ఆర్టీఎస్ సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ వర్చువల్ గ్లోబల్ కాంపిటీషన్స్-2020 రికార్డులు సృష్టించాయి.
రెండు రోజుల పాటు..7 విభాగాల్లో పోటీలు జరిగాయి. వివిధ దేశాల నుంచి తెలుగు ప్రజలు దాదాపు 1850 మంది పాల్గొన్నారు. జూమ్ యాప్‌లో 100 మంది జడ్జీలతో 128 గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. ఎక్కువ సేపు అంతర్జాలంలో నిర్వహించిన కార్యక్రమంగా 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్', 'ఇండియన్ వరల్ రికార్డ్' టైటిల్‌తోపాటు 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించింది.
ఇదీ చదవండి: విశాఖ హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో పొగలు.. ఆందోళనలో ప్రజలు