ETV Bharat / city

GOVERNOR: 'ప్రతి గెలుపు వెనుక ఎందరో సైనికుల బలిదానం ఉంది'

విజయవాడ రాజ్​భవన్‌లో రాష్ట్ర సైనిక్ సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో 'స్వర్ణిం విజయ్ వర్ష్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరయ్యారు. యుద్ధాలు చేసిన తర్వాత సిద్ధించే విజయాల వెనుక పలువురు సైనికుల బలిదానం ఉంటుందని గవర్నర్ కొనియాడారు.

గవర్నర్ బిశ్వభూషణ్
గవర్నర్ బిశ్వభూషణ్
author img

By

Published : Sep 8, 2021, 6:03 PM IST

సైనికుల అత్యున్నత త్యాగాలకు యుద్ధాలు నిలువుటద్దం వంటివని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. యుద్ధాలు చేసిన తర్వాత సిద్ధించే విజయాల వెనుక పలువురు సైనికుల బలిదానం ఉంటుందని, ఇది ఆయా కుటుంబాలకు అపారమైన కష్టనష్టాలను ఆపాదిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ రాజ్​భవన్‌లో రాష్ట్ర సైనిక్ సంక్షేమ విభాగం నిర్వహించిన ‘స్వర్ణిం విజయ్ వర్ష్’ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

చరిత్రలో చిన్న యుద్ధం...

ప్రభుత్వంతో పాటు పౌరులు సైతం మాజీ సైనికుల అవసరాలను సామాజిక బాధ్యతగా భావించి శ్రద్ధ వహించాలని గవర్నర్ అన్నారు. 1971 నాటి యుద్ధ వీరులు, కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో ముగిసిన యుద్ధాలలో 1971 నాటి యుద్ధం ఒకటిదని ఇది కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగిందని వివరించారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్​పై భారత్ నిర్ణయాత్మక, చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని గవర్నర్ వెల్లడించారు. ఈ పరిణామాల ఫలితంగా 'బంగ్లాదేశ్ ఏర్పాటు' సాధ్యమైందన్నారు. ఈ విజయం ఇతర దేశాలలో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచిందని హర్షం వ్యక్తం చేశారు.

శౌర్య అవార్డులతో సత్కారం..

2020 డిసెంబర్ 16న 'స్వర్ణిం విజయ్ వర్ష్'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని గవర్నర్ గుర్తు చేశారు. జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ప్రారంభమైన విజయ జ్వాల.. దేశ వ్యాప్తంగా ప్రయాణిస్తూ విజయవాడ చేరుకోవటం ఆనందంగా ఉందన్నారు. ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు దేశం రుణపడి ఉందని వివరించారు. అనంతరం విజయ జ్వాల కార్యక్రమం ఇన్​ఛార్జ్ అధికారి వీఎంరాజు నుంచి గవర్నర్ విజయ జ్వాలను స్వీకరించారు. ఈ సందర్భంగా 1971 నాటి యుద్ధ వితంతువులు, వికలాంగులను గవర్నర్ శౌర్య అవార్డులతో సత్కరించారు.

ఇవీచదవండి.

ATCHENNAIDU: రైతులకు ఎవరేమి చేశారో చర్చకు సిద్ధమా?: అచ్చెన్నాయుడు

హైవేపై వందలాది కండోమ్​లు- కావాలనే పడేశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.