ETV Bharat / city

ఉపాధి హామీ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసన - తెదేపా వార్తలు

ఉపాధి హామీ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసన చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు జులై ఆఖరులోగా బిల్లులను చెల్లించాల్సి ఉన్నా విడుదల ఇంకా విడుదల చేయకపోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 175 నియోజకవర్గాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో.. ఐదు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందించారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి పెండింగ్​ బిల్లులు చెల్లించకుండా, అధికార వైకాపాకు చెందిన నేతలతో కొత్తగా ఉపాధి హామీ పనులు చేయించి వారికి మాత్రమే బిల్లులు చెల్లించడం దారుణమని తెదేపా నేతలు ఆరోపించారు.

pending bills of mgnrega
pending bills of mgnrega
author img

By

Published : Aug 2, 2021, 8:52 PM IST

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం 175 నియోజకవర్గాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో.. ఐదు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందించారు. తెదేపా పాలనలో చేసిన ఉపాధిహామీ పనులకు సంబంధించి పెండింగ్​ బిల్లులు చెల్లించకుండా, అధికార వైకాపాకు చెందిన నేతలతో కొత్తగా ఉపాధి హామీ పనులు చేయించి వారికి మాత్రమే బిల్లులు చెల్లించడం దారుణమని తెదేపా నేతలు ఆరోపించారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం శ్రేణులు నిరసన తెలియజేశాయి. ఈ ఆందోళనలో జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు.

కృష్ణా జిల్లాలో..

పెండింగ్​లో ఉన్న ఉపాధిహామీ బిల్లులను సత్వరమే విడుదల చేయాలని కోరుతూ తెదేపా జాతీయ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య డిమాండ్‌ చేశారు.

ఉపాధిహామీ పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని నినాదాలు చేస్తూ కృష్ణాజిల్లా పామర్రు మండల పరిషత్ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల బిల్లులను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం మండల పరిషత్ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు.

పెండింగ్ లో ఉన్న ఉపాధిహామీ బిల్లులను సత్వరమే విడుదల చేయాలని కోరుతూ గన్నవరంలో తెదేపా నేతల నిరసన వ్యక్తంచేశారు. పార్టీ శ్రేణులు స్థానిక ఎంపీడీవో కార్యాలయం, పలు ప్రధాన కూడళ్లలో ప్రదర్శన చేపట్టారు. సీఎం డౌన్.. డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో దొంతు చిన్నా, ఆళ్ల గోపాలకృష్ణ, జాస్తి వెంకటేశ్వరరావు, దండు సుబ్రహ్మణ్యం, మహిళా నేత లక్ష్మీ తదితర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

ఉపాధిహామీ పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని నినాదాలు చేస్తూ కైకలూరు మండల పరిషత్ కార్యాలయం ముందు తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నాయకత్వంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులతో నిర్వహించిన ఎన్​జీఆర్​ఎస్ పనుల బిల్లులను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ డిమాండ్ చేశారు. అనంతరం మండల పరిషత్ అధికారికి పార్టీ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.

ఉపాధి హామీ పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆందోళన చేశారు. నందిగామ మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉపాధి హామీ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు.

గుంటూరు జిల్లాలో..

కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధి హామీ బిల్లులను వెంటనే జగన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించాలని నరసరావుపేట పార్లమెంట్ తెదేపా ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఉపాధి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

విశాఖ జిల్లాలో..

ఉపాధి హామీ పథకం బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు.ఎంపీడీవో తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన న కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గ అధ్యక్షులు బుద్ద నాగ జగదీశ్వర రావు పాల్గొన్నారు.

175 నియోజకవర్గాలలో ఉపాధి హామీ పనుల్లో ఉన్నటువంటి బిల్లులన్నీ పెండింగులో ఉంటే కేవలం ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నియోజకవర్గాలలో మాత్రమే ఉపాధి హామీ బిల్లులు చెల్లించడం ఎంత వరకు న్యాయమని అరకు తెదేపా పార్లమెంట్ ఇంఛార్జ్ గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు.

అనంతపురం జిల్లాలో..

అనంతపురం జిల్లా కదిరి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తెదేపా చేపట్టిన ఆందోళనలో నియోజకవర్గ ఇంఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. తెలుగుదేశం పాలనలో పనులు చేసిన వారందరూ తెదేపా కార్యకర్తలే అన్న కక్ష సాధింపుతో బిల్లులు ఆపివేయడం దుర్మార్గమని అన్నారు.

హిందూపురంలో తెలుగుదేశం కార్యాలయం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకొని తమకు పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని మాజీ సర్పంచ్​లు డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రాన్ని అందించారు.

మడకశిర పట్టణంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల ఆందోళన తెలిపారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు జిల్లాలో పలు చోట్ల ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు నిరసనలో పొల్గొన్నారు.

ఆత్మకూరు పట్టణ, రూరల్ తెదేపా నాయకులు ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు తుమ్మల చంద్రారెడ్డి, కేత విజయభాస్కర్ రెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, శశిధర్ రెడ్డి, పెంచల చౌదరి, తదితరులు పాల్లొన్నారు.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా ఆధ్వర్యంలో చేసిన ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ.. తెదేపా నేతలు ఎంపీడీవో కార్యాలయం దగ్గర నిరసన చేశారు. ఈ ఆందోళనలో కనిగిరి తెదేపా ఇంఛార్జ్ ఉగ్రనరసింహారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

యర్రగొండపాలెంలో తెలుగు దేశం పార్టీ ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గత ప్రభుత్వంలో చేసిన ఉపాధి హామీ బిల్లులు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్టర్లకు వెంటనే విడుదల చేయాలని గిద్దలూరు తెదేపా ఇంఛార్జ్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి గిద్దలూరు ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు.

దర్శిలో తెదేపా అధినేత ఆదేశాల మేరకు ఉపాధిహామీ పనుల బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దర్శి తెదేపా బాధ్యుడు పమిడి రమేష్, దర్శి మాజీ ఎమ్మెల్యే పాపారావు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు,కార్యకర్తలు పట్టణంలోని పార్టీ ఆఫీసు నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల అభివృద్ధి అధికారికి వినతిపత్రం అందజేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో..

ఉపాధి హామీ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద తెదేపా శ్రేణులు నిరసన తెలిపాయి. ఆ పార్టీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

కర్నూలు జిల్లాలో..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద చేసిన బిల్లులను చెల్లించాలని తెలుగుదేశం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయా మండలాల్లో మండల పరిషత్ కార్యాలయాల వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఉపాధి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో తెలుగుదేశం నాయకులు గడ్డం నారాయణరెడ్డి, జయన్న, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్​లో ఉన్న ఉపాధిహామీ బిల్లులను వెంటనే చెల్లించాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. న్యాయస్థానం సూచించినా బిల్లులు చెల్లించక పోవడం అన్యాయమని అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీడీవో కార్యాలయం ఎదుట తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం మండల ఈవోఆర్డీ వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు.

ఆదోనిలో ఎంపీడీఓ కార్యాలయం దగ్గర తెదేపా నాయకులు ఆందోళన చేశారు. ఉపాధి హామీ బిల్లులు చెలించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీఓ గీతావనికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కడప జిల్లాలో..

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో నియోజక ఇంఛార్జ్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

శ్రీకాకుళంలో..

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పథకం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టిన పనులు కు తక్షణమే బిల్లులు చెల్లించాలని శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కూన రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించాలని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్నంలో తెదేపా కార్యాలయంలో నుంచి మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయానికి ద్విచక్రవాహనాలపై ర్యాలీ నిర్వహించి చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని అధికారులకు వినతిపత్రం అందించారు.

ఇదీ చదవండి:

POLAVARAM: పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్‌ డీపీఆర్‌ మా వద్ద పెండింగ్‌లో లేదు: కేంద్రం

Vishaka Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోం: ఎంపీ విజయసాయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.