టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన పివీ సింధుకు నగదు బహుమానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో ప్రతిభ చాటిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. 2017–22 స్పోర్ట్స్‌పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ. 75 లక్షలు, రజత పతక విజేతలకు రూ. 50 లక్షలు, కాంస్య సాధించిన వారికి రూ. 30 లక్షల ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.
పీవీ సింధుకు ఇటీవలే రాష్ట్రప్రభుత్వం విశాఖలో రెండు ఎకరాల స్థలాన్ని అకాడమీ కోసం కేటాయించిందని గుర్తు చేశారు. టోక్యో ఒలింపిక్స్ వెళ్లేముందు సింధుతో పాటు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనిలకు రూ. 5 లక్షల చొప్పున నగదు సహాయం చేశామని తెలిపారు. ప్రతిభ చాటుతున్న రాష్ట్ర క్రీడాకారులందరికీ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న ముఖ్యమంత్రి.. 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ క్రీడల్లో ప్రతిభ చూపిన వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి..
EWS Reservations: విద్యాసంస్థల్లో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ కోటా అమలు: ఉన్నత విద్యామండలి