equipment maintenance: ఆస్పత్రుల్లో పరికరాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏజెన్సీని నియమించేందుకు.. మళ్లీ టెండర్లను ఆహ్వానించింది వైద్యారోగ్య శాఖ. గతంలో టెండర్ల ప్రకటన చేయగా ఒక సంస్థ మాత్రమే.. బిడ్ దాఖలు చేయడంతో దానిని రద్దు చేసి మరోసారి ప్రకటన చేసింది. ప్రస్తుతం బోధన, జిల్లా, సామాజిక, ప్రాంతీయ, ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాల్లో 75 వేల పైన పరికరాలు ఉన్నాయి. ఇవి ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలని.. ఫిర్యాదుల స్వీకరణకు 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
equipment maintenance: క్రిటికల్ నాన్‌క్రిటికల్‌కు జిల్లా స్థాయిలో రిపేరు వర్క్‌షాపు ఉండటంతో పాటు.. మూడు, ఆరునెలలు లేదా ఏడాదికోసారైనా సర్వీసింగ్ చేసే విధంగా షరతులను విధించింది. ఎంపిక చేసిన సంస్థకు తొలుత 33 నెలల వరకు పరికరాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని... పనితీరు సంతృప్తికరంగా ఉంటే ఒప్పందాన్ని అదనంగా 24 నెలలపాటు పొడిగిస్తామన్నారు. అలాగే... రివర్స్ టెండరింగ్ ద్వారా టెండరును ఎంపిక చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: Idupulapaya IIIT: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు సఫలం