ETV Bharat / city

విమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ సాధించిన నాలుగో తెలుగమ్యాయి... ఎవరంటే..? - చదరంగంలో అద్భుతంగా రాణిస్తున్న విజయవాడ యువతి ప్రియాంకపై ప్రత్యేక కథనం

తెలియని వయసులోనే చదరంగంలోకి అడుగుపెట్టింది. అదే లోకంగా మార్చుకుని.. చెస్‌లో ఉన్నత స్థానానికి చేరుకుంది. ఏడేళ్ల ప్రాయంలోనే జిల్లా స్థాయిలో మొదలైన ఆమె ఆట... క్రమంగా నేడు విమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ సాధించే స్థాయికి చేరుకుంది. ఈ టైటిల్‌ సాధించిన 4వ తెలుగమ్మాయిగానూ చరిత్ర సృష్టించింది..ప్రియాంక. ఈ ఏడాది చివరి లోగా.. ఇంటర్నేషనల్ మాస్టర్ అవ్వాలనే లక్ష్యంతో కృషి చేస్తోంది.

women grandmaster title winner priyanka from vijayawada
విమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్​గా ను సాధించిన నాలుగో తెలుగు అమ్మాయిగా విజయవాడ యువతి
author img

By

Published : Mar 17, 2022, 1:50 PM IST

Updated : Mar 17, 2022, 2:48 PM IST

విమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏడేళ్ల వయసులోనే చదరంగంలో అడుగు పెట్టింది.. ఈ అమ్మాయి. ఇష్టమైన ఆటలో ఉన్నాననే ఆనందంలో తన ధ్యాసనంతా ఆటపైనే నిలిపింది. 64 గడుల్లోని ఎత్తుల్ని ఒడిసి పట్టింది. ప్రత్యర్థుల్ని చిత్తుచేసే వ్యూహాల్ని అలవోకగానే అందుకుని... ఆ నైపుణ్యాలతోనే అద్భుతంగా రాణిస్తోంది...విజయవాడకు చెందిన నూతక్కి ప్రియాంక.

తన ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో... కొద్ది రోజుల్లోనే చదరంగంలో మెళకువలు నేర్చుకుంది. అద్భుత నైపుణ్యంతో జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు పతకాల పంట పండిస్తోంది. చదరంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే తన తల్లి.. కోరిక నిజం చేస్తూ విమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ అందుకుంది...

అందరు పిల్లల్లానే... ఓ సారి వేసవి శిక్షణ శిబిరానికి వెళ్లింది ప్రియాంక. అక్కడ వివిధ క్రీడల్లోల్లో ఆమెను చెస్‌ విపరీతంగా ఆకర్షించగా.. అందులో చేరిపోయింది. ఆ ఆసక్తితో కోచ్‌ చెప్పే టెక్నిక్‌ల్ని త్వరగానే నేర్చుకునేది. 2 నెలల ట్రైనింగ్‌లోనే అండర్-7 జిల్లా స్థాయి ఛాంపియన్‌ సహా ... రాష్ట్ర స్థాయిలో వెండి పతకాల్ని అందుకుంది.

తక్కువ కాలంలోనే మంచి ప్రతిభ చూపిన ప్రియాంకకు... ప్రొఫెషనల్‌గా ట్రైనింగ్ ఇప్పిం చాలని సూచించాడు.. ఆమె కోచ్‌. దాంతో.. ఏడాది పాటు చదువు పక్కకు పెట్టి... చెస్‌ మెళకువలు నేర్చుకుంది... ప్రియాంక. రోజుకు 8 గంటలపైనే సాధన చేస్తున్న ఈ యువతి.. ఇప్పటి వరకు అండర్‌-9 కేటగిరిలో జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు..... అండర్‌ 10 కేటగిరిలో వర్డల్‌, ఆసియా స్థాయిలో పతకాలు గెలుపొందింది.

ఇప్పటివరకు ఆసియా పరిధిలో 6 బంగారు పతకాలు సాధించిన ప్రియాంక... 2018లో విమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా గెలుపొందింది. ఇటీవల జరిగిన విమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ -WGM పోటీలో టైటిల్‌ సాధించి... ఆశ్చర్యపరిచింది. ఈ పోటీల్లో ఇప్పటి వరకు భారత్‌ నుంచి 23 మంది టైటిళ్లు సాధించగా.. వారిలో ముగ్గురు తెలుగు యువతు కాగా... ప్రియాంక 4వ తెలుగమ్మాయిగా గుర్తింపు సాధించింది.

ఆటలో గెలుపోటములు సహజం. కొన్నిసార్లు అనుకున్నంతగా ప్రదర్శన చేయలేక పోయినప్పుడు.... ప్రియాంకకు మానసికంగా తోడ్పాటునందిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఎక్కడా కుంగిపోకుండా ధైర్యం చెబుతూ, ప్రోత్సహిస్తున్నారు. అంతే కాదు... తమ కుమార్తె అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణంగా ఉందంటూ పొంగిపోతున్నారు..

ఈ ఏడాది చివరిలోగా ఇంటర్నేషనల్ మాస్టర్ సాధించాలన్నదే లక్ష్యంగా కృషి చేస్తోంది ప్రియాంక. ఏ రంగమైనా పోటీ ఉంటుందని.... ఓపిక, పట్టుదల ఉంటే ఎలాంటి పోటీలోనైనా నెగ్గుకురావచ్చని నిరూపిస్తోంది... ఈ యువతి.

ఇదీ చదవండి: Registrations: 4.97 లక్షల డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు

Last Updated : Mar 17, 2022, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.