గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్తో పాటు.. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి పాలనను 2022 ఏప్రిల్ 4 తేదీ వరకూ.. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి పాలనను 2022 ఏప్రిల్ 10 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ రెండు కార్పొరేషన్లలో.. ప్రత్యేకాధికారుల పాలన ఈ నెల 2, 10 తేదీలతో ముగుస్తుండటంతో గడువు పొడిగిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:
Durga Temple: ఇంద్రకీలాద్రిపై అన్యమత ప్రచారం..పోలీసుల దర్యాప్తు