లాక్‌డౌన్ అమలవుతున్న వేళ ఏ కాలుష్యమైనా సరే తగ్గుతుందని అంతా భావిస్తుంటారు. కానీ భాగ్యనగరంలోని కొన్ని ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం స్వల్పంగా పెరిగింది. ఈ సమయంలోనూ మోత మోగుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) తాజా పరిశీలనలో తేల్చింది. అత్యంత కీలకమైన గచ్చిబౌలిలో రాత్రిపూట ఏకంగా 15 శాతం పెరగడం గమనార్హం.
8 ప్రాంతాల్లో పరిశీలించి..
శబ్ద కాలుష్యాన్ని నమోదు చేసేటప్పుడు వాణిజ్య, నివాసిత, పారిశ్రామిక, సున్నిత ప్రాంతాలుగా వర్గీకరిస్తారు. నిర్దేశిత పరిమితులు ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి. తార్నాక, అబిడ్స్, జేఎన్‌టీయూ, ప్యారడైజ్, సనత్‌నగర్(వాణిజ్య), జీడిమెట్ల(పారిశ్రామిక), జూపార్కు(సున్నిత), గచ్చిబౌలి(నివాసిత)లో లాక్‌డౌన్‌కు ముందు.. ఇప్పుడు తీవ్రతపై టీఎస్‌పీసీబీ అధ్యయనం చేసింది. కూకట్‌పల్లిలో పగలు 6.1, రాత్రి 4.1, గచ్చిబౌలిలో పగలు 4.4, రాత్రి 15.9, తార్నాకలో రాత్రి 0.3, జీడిమెట్లలో పగలు 4.2, రాత్రి 10.4 శాతం శబ్ద కాలుష్యం పెరిగింది. ఈ ప్రాంతాల్లో వాహనాల హారన్ల మోత ఈ పెరుగుదలకు కారణమై ఉంటుందని గుర్తించారు.
ఇక్కడ తగ్గుదల
అబిడ్స్‌లో పగలు 17.6, రాత్రి 20.4, పంజాగుట్టలో పగలు 1.1, రాత్రి 3.5, జూపార్క్ దగ్గర పగలు 8.9, రాత్రి 7.6, ప్యారడైజ్‌లో పగలు 5.3, రాత్రి 5.4 శాతం తగ్గింది.
ఇదీ చూడండి ..