ETV Bharat / city

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​ల బదిలీకి ప్రభుత్వం ఉత్తర్వులు

author img

By

Published : Mar 12, 2022, 7:16 PM IST

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయ కార్యదర్శిగా బాబు.ఏను బదిలీ చేయగా.. సీసీఎల్ఏ కార్యదర్శిగా పనిచేస్తున్న చక్రవర్తిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​ల బదిలీలు
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​ల బదిలీలు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయ కార్యదర్శిగా బాబు.ఏను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. డెయిరీ డెవలప్​మెంట్ ఎండీగా ఆయనకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు.

సీసీఎల్ఏ కార్యదర్శిగా పనిచేస్తున్న బీహెచ్ఎన్ చక్రవర్తిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నెల్లూరు జిల్లా గ్రామవార్డు సచివాలయాల జేసీ జి.గణేశ్ కుమార్​ను సీసీఎల్ఏలో జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఏలూరు ఆర్డీవో పి.రచనను సీసీఎల్ఏలోని సీఎంఆర్​వో ప్రాజెక్టు డైరెక్టర్​గా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఎన్. తేజ్​ భరత్​ను సీసీఎల్ఏ కార్యాలయంలో విజిలెన్సు జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి

విద్యార్థులకు ల్యాప్​టాప్​లు.. ఓటీటీలో పాఠాలు: మంత్రి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.