HI-TECH HARIDAS : సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే మొదటి అతిథులు హరిదాసులు. ధనుర్మాసం ప్రారంభం నుంచి సంక్రాంతి ముగిసే వరకు ఊరూరా ఇంటింటికీ తిరిగి హరినామస్మరణ వినిపిస్తారు. తరతరాలుగా ఈ వృత్తిని కొనసాగిస్తున్న హరిదాసులు.. ప్రస్తుతం మారుతున్న కాలానికి తగ్గట్టుగా తీరుతెన్నులను మార్చుకుంటున్నారు. హైటెక్ యుగానికి తగ్గట్టుగా వేషధారణలోనూ ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. గతంలో కాలినడకన వచ్చే వారు ఇప్పుడు వాహనాలపై ఇంటింటికీ తిరుగుతున్నారు.
పూర్వీకుల ట్రెండ్‌కు భిన్నంగా..
ఏడాది పొడవునా ఇతర పనుల్లో ఉండే దాసరి కులస్తులు సంక్రాంతికి హరిదాసులుగా మారతారు. ఒకప్పుడు తలపై దానం తీసుకునే అక్షయపాత్రతో ఇంటికి వచ్చేవారు. కానీ ఇప్పుడు వారి వారసులు పూర్వీకులు అనుసరించిన ట్రెండ్‌కు భిన్నంగా కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. వాహనంపై ఇంటింటికీ తిరుగుతూ దానం స్వీకరిస్తున్నారు. వాహనం ముందు భాగంలో దానం తీసుకునే పాత్రను కట్టి హరినామస్మరణ గీతాలను టేప్ రికార్డర్‌లో పెట్టి లోగిళ్లకు వెళ్తున్నారు.
విమర్శలు.. ప్రశంసలు..
HI-TECH HARIDAS : హరిదాసుల నూతన ఒరవడిని మారుతున్న కాలానికి నూతన విధానమని కొందరు అంటుండగా.. మరికొందరు సంస్కృతీ సంప్రదాయాలకు ఇది విరుద్ధమని విమర్శిస్తున్నారు. హరిదాసులు మాత్రం కాలం అందరిలోనూ మార్పులు తీసుకొచ్చిందని, అదేవిధంగా తమ వృత్తిలోనూ మార్పు వచ్చిందని చెబుతున్నారు.
ఇవీచదవండి.