కాంగ్రెస్ నేత రాహల్ గాందీ నైట్ క్లబ్ వ్యవహారంపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ స్పందించారు. దేశంలో ఎన్నో సమస్యలను పక్కన పెట్టి చిన్న సమస్యను భాజపా రాజకీయం చేస్తుందన్నారు. వివాహ కార్యక్రమానికి అతిధిగా హాజరైతే దాన్ని రాద్దాంతం చేయడం తగదని.., భాజపా నాయకులు చిల్లర వేషాలు మానుకోవాలని హితవు పలికారు. రాహుల్ గాంధీ నిజమైన దేశభక్తుడని.., ఆయన ప్రధాని అయితేనే దేశం బాగు పడుతుందని అన్నారు. వివాహాలకు హాజరుకావటం సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమేనని.. అదేమి నేరం కాదని చెప్పారు.
సన్నిహితుల వివాహా ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు మాత్రమే స్నేహపూర్వక దేశమైన నేపాల్‌కు రాహుల్ గాంధీ వెళ్లారన్నారు. వివాహ వేడుకకు హాజరు కావటం ఇప్పటివరకైతే నేరం కాదని.., భాజపా ఇకపై దానిని కూడా చట్టవిరుద్ధంగా మారుస్తుందేమోనని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: నైట్‌క్లబ్‌లో రాహుల్ గాంధీ.. వీడియో వైరల్.. భాజపా విమర్శలు!