ETV Bharat / city

కోర్టులో సాక్ష్యాధారాల అపహరణ.. న్యాయవ్యవస్థపై దాడిగానే పరిగణించాలి: శైలజానాథ్

నెల్లూరు కోర్టులో సాక్ష్యాధారాలు అపహరణకు గురికావడాన్ని.. న్యాయవ్యవస్థపై దాడిగానే పరిగణించాలని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. చోరీ ఘటనపై ఎవరి ప్రమేయమూ లేకుండా కేసును నిశితంగా పర్యవేక్షించేందుకు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించాలని కోరారు.

శైలజానాథ్
శైలజానాథ్
author img

By

Published : Apr 17, 2022, 10:23 PM IST

నెల్లూరు కోర్టులో సాక్ష్యాధారాలు అపహరణకు గురికావటంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. ఈ చోరీ ఘటనపై ఎవరి ప్రమేయం లేకుండా కేసును నిశితంగా పర్యవేక్షించేందుకు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించాలని కోరారు. సమాజంలో శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు చోరీ కావటం న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కుట్రలో భాగస్వామ్యులైన వారందరినీ అరెస్టు చేయాలన్నారు.

ఇద్దరు నిందితులు అరెస్టు: కోర్టులో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విజయారావు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సహా పూర్తి ఆధారాలతో కేసు ఛేదించినట్లు తెలిపారు. కంప్యూటర్లు, ఇనుప, పాత సామాన్లు దొంగతనం చేసే ముఠాలోని ఇద్దరు వ్యక్తులు చోరీ చేసినట్లు చెప్పారు. నిందితులు కేవలం సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకుని మిగతా పేపర్లను పడేశారని వెల్లడించారు. నిందితులు సయ్యద్‌ హయత్‌, ఖాజా రసూల్​ను ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులపై 14 పాత కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ట్యాబ్‌, ల్యాప్‌ట్యాప్‌, 4 సెల్‌ఫోన్లు, 7 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ జరిగింది..: నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఓ కోర్టులో దొంగలు పడ్డారు. కీలక కేసుకు సంబంధించిన పత్రాలు అపహరించారు. విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్క్​ స్థానిక చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో 13వ తేదీ అర్ధరాత్రి కొందరు వ్యక్తులు చొరబడ్డారు. ఓ కీలక కేసులో పత్రాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకువెళ్లారు. 14వ తేదీ (గురువారం) ఉదయం కోర్టుకొచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించగా.. అందులో ఉండాల్సిన పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: కోర్టులో చోరీ.. న్యాయవ్యవస్థపై దాడిగా గుర్తించాలి: వర్ల రామయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.