విశాఖపట్నం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు సారె సమర్పించారు. కనకమహాలక్ష్మి దేవస్థానం అధికారులకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈఓ భ్రమరాంబ, చైర్మన్ పైల సోమినాయుడు స్వాగతం పలికారు.
దసరా ఉత్సవాల్లో కనకమహాలక్ష్మి దేవస్థానం నుంచి సారె ఆనవాయితీగా సమర్పించడం సాంప్రదాయంగా వస్తోంది. మహాలక్ష్మి అలంకరణలో ఉన్న దుర్గమ్మకు విశాఖపట్నం కనకమహాలక్ష్మి దేవస్థానం ఈఓ జ్యోతి మాధవి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
CM JAGAN: రేపు విజయవాడకు సీఎం జగన్.. కనకదుర్గ వారధిపై ట్రాఫిక్ ఆంక్షలు