ETV Bharat / city

మరోసారి భేటీకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు

author img

By

Published : Oct 10, 2020, 5:14 PM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ అంశంపై రెండు, మూడు రోజుల్లో... ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ముఖ్య అధికారులు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

మరోసారి భేటీకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు
మరోసారి భేటీకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు

అంతరాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందంపై తెలంగాణ-ఏపీ రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమయ్యారు. అనేక అంశాలపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చించారు. రెండు రాష్ట్రాల భూభాగాల్లో ఆయా ఆర్టీసీ బస్సులు తిరిగే కిలోమీటర్లు, సర్వీసులు, రూట్ల వారీగా చర్చించారు.

కొలిక్కి వచ్చేనా?

లాక్‌డౌన్‌కు ముందు ఏపీ బస్సులు తెలంగాణకు 2.65 లక్షల కిలోమీటర్లు తిప్పేవారు, తెలంగాణ బస్సులు ఏపీకి... 1.61 లక్షల కిలోమీటర్ల వరకు తిప్పేవారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు సరిసమానంగా 1.61లక్షల కిలోమీటర్లు తిప్పాలని టీఎస్​ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఆ విషయంపై తమ ఉన్నతాధికారులతో చర్చిస్తామని ఏపీఎస్​ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ సారి జరగనున్న భేటీలో పూర్తిగా కిలోమీటర్లు, సర్వీసులు, రూట్లపై కూలంకుశంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:

ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.