తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని భాగ్యలత సమీపంలో ఆర్టీసీ అద్దె బస్సు బీభత్సం సృష్టించింది. హకీంపేట డిపోకు చెందిన టీఎస్ 08 యూబీ 5496 నెంబరు గల అద్దె బస్సు భాగ్యలత వద్ద డివైడర్ మీదకు దూసుకెళ్లింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. డివైడర్‌పై విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి... తర్వాత ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. వాహనదారుడి తలకు గాయాలయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
ఇదీ చూడండి : ఈ దొంగ మామూలోడు కాదు.. బాబోయ్!