RTA Commissioner on YSR Vahan MItra Scheme: వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా అర్హులకు ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించనున్నట్లు రవాణా శాఖ కమిషనర్ పి.రాజబాబు తెలిపారు. ఈనెల 13న అర్హులైన సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్లకు సీఎం జగన్ చేతు మీదుగా సాయం అందించనున్నారు. వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్నెస్, మరమ్మత్తుల నిమిత్తం నగదు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని.. ఈ నెల 7 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఆరంచెల విధానంలో పారదర్శకంగా జరుగుతుందన్నారు. దరఖాస్తుదారు తనకు సంబంధించిన భూమి, ఆస్థి వివరాలు, ఆస్థి పన్ను కట్టిన వివరాలు, విద్యుత్ వినియోగం, ఆదాయ పన్ను, కులం వివరాలు తెలపాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఇప్పటికే వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఆర్థిక సాయం పొందుతున్నవారు వాహనంతో నిలబడిన ఫోటోను గ్రామ సచివాలయం ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక కుటుంబానికి ఒక వాహనానికి మాత్రమే ఆర్థిక సహాయం అందజేస్తాం. వాహనదారులు ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తు దారు విద్యుత్ వినియోగం 6 నెలల సగటు మీద నెలసరి 300 యూనిట్లు దాటితే పథకానికి అనర్హులుగా ప్రకటిస్తాం. వాహన యజమాని హక్కులు మార్పు చేసినా, తప్పుడు పత్రాలు సమర్పించినా వారి జాబితాను అనర్హులుగా పరిగణిస్తాం. -పి.రాజబాబు, రవాణా శాఖ కమిషనర్
ఇదీ చదవండి: